డిప్రెష‌న్‌లో బ్ర‌హ్మాజీ

నటుడు బ్రహ్మాజీ డిప్రెషన్ లో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఈ విషయంలో సోనూసూద్ ని సాయం కోరాడు. అలాగని ఇది సీరియస్ మేటర్ కాదు. సరదా ట్విట్. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి సోనూసూద్ గొప్ప మనసు చాటుకుంటున్న సంగతి తెలిసిందే. తవంతుగా సాయం చేస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన సహాయాల పరంపర కొనసాగుతోంది. సోనూసూద్ సాయ గుణానికి ఫిదా అయిన బ్రహ్మాజీ ఆయనకి ట్విట్టర్ వేదికగా ఫన్నీ రిక్వెస్ట్ పెట్టారు.

‘డియర్‌ సూపర్‌మ్యాన్‌ సోనూ భాయ్‌.. నేను  డిప్రెషన్‌లో ఉన్నాను. మెంటల్‌గా లాక్‌డౌన్‌ అయ్యాను. హైదరాబాద్‌లో చిక్కుకు పోయాను. ప్లీజ్‌ నన్ను  క్రొయేషియా తీసుకెళ్లు’ అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బ్ర‌హ్మాజీ ట్వీట్‌పై సోనూ సూద్ స్పంద‌న ఎలా ఉంటుందోన‌నే ఉత్కంఠ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొంది. సీరియస్ గా సాయం చేస్తున్న సోనూసూద్ కి ఇటీవల సిల్లీ రిక్వెస్ట్ లు వస్తున్నాయి. అయితే సోనూసూద్ కి బాగా తెలిసిన వ్యక్తి బ్రహ్మాజీ మాత్రం.. ఆయన సాయగుణాన్ని మెచ్చుకుంటూ సరదగా ట్విట్ చేసినట్టున్నారు.