ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ సీఎం జగన్ కరోనా విజృంభిస్తున్న కఠిన సమయంలోనూ కొత్త సంక్షేమ పథకాలని తీసుకొస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా విషయంలోనూ ఏపీ ప్రభుత్వ పనితీరు బాగుంది. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా  ఉంది. తాజాగా కొవిడ్‌ ఆసుపత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

287 ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరిపడా వైద్యులు, సిబ్బంది ఉండాలని సూచించారు. అదేవిధంగా స్పెషలిస్టులను, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు లోపాలను, సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు సక్రమంగా అందాలని అధికారులకు నిర్దేశించారు. మందులు ఇవ్వడం సహా సత్వర చికిత్స అందించాలన్నారు.