మెగాస్టార్ బర్త్ డే CDP వచ్చేసింది !

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే (ఆగస్ట్ 22) సెలబ్రేషన్స్ పీక్స్ చేరిపోయాయ్. రేపే అన్నయ్య బర్త్ డే. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కామన్ డిస్ ప్లే (సీడీపీ)ని విడుదల చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో మెగాస్టార్ బర్త్ డే CDP షేర్ చేశారు. ఇందులో చిరు ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మెగాస్టార్ పీఠం అధిరోహించినట్టు చూపించారు.

ఇక #HBDMegastarChiranjeevi యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్ లో  కొనసాగుతోంది. అభిమానులతో పాటు మెగా యంగ్ హీరోలు మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయనతో ఉన్న తీపి జ్ఝాపకాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ బర్త్ డే వేడుకలని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోనున్నారు.