సినీ కార్మికులకు మెగాస్టార్ బర్త్ డే గిఫ్త్

కరోనా లాక్‌డౌన్ టైమ్ లో సినీ కార్మికులని ఆదుకోవడానికి ముందుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ద్వారా విరాళాలు సేకరించి.. సినీ కార్మికులని ఆదుకున్నారు. వారికి నిత్యవసర సరుకులని అందజేశారు. ఇప్పటికే రెండుసార్లు సిసిసి నుంచి సినీ కార్మికులకి సరుకులు అందాయి. తాజాగా మూడోసారి సిసిసి సరుకులు అందబోతున్నాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ప్రకటన చేశారు.

ఈ సమయంలో మీ కుటుంబం క్షేమంగా ఉండటమే ముఖ్యం. క్లిష్ట ప‌రిస్థితుల నుండి గ‌ట్టెక్కాల‌ని, మ‌ళ్ళీ మ‌న ప‌నుల‌ని ఆనందంగా చేసుకొనే రోజులు రావాల‌ని ఆ వినాయ‌కుడిని ప్రార్ధించండి అంటూ చిరు వీడియోలో తెలిపారు.  కరోనా క్రైసిస్ ఛారిటీ నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు చిరు. ఈ ప్రకటనని సినీ కార్మికులు మెగాస్టార్ బర్త్ డే (ఆగస్ట్22) గిఫ్ట్ గా భావిస్తున్నారు.

ఇక రేపు మెగస్టార్ బర్త్ డే కానుకగా ఆయన తాజా చిత్రం ఆచార్య నుంచి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక అభిమానులు మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఓ నెల ముందు నుంచే మొదలెట్టారు. సోషల్ మీడియా వేదికగా హాపీ బర్త్ డే మెగాస్టార్ యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.