ఆచార్య మోషన్ పోస్టర్ : ధర్మస్థలిలో మెగా యుద్ధం

మెగాస్టార్ చిరజీవి బర్త్ డే బహుమతులు వచ్చేశాయ్. ముందే చెప్పినట్టుగా చిరు బర్త్ డే కానుకగా ఆయన తాజా చిత్రం ‘ఆచార్య’ నుంచి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లని విడుదల చేశారు. జనం కోసం పోరాడుతున్న వ్యక్తిగా చిరంజీవి కనిపిస్తున్నారు. ధర్మస్థలి అనే ఊరి ప్రజల కోసం చిరు కత్తిని చేతపట్టినట్టుగా పోస్టర్ లో ఉంది. ధర్మస్థలిలో మెగా యుద్ధంగా మోషన్ పోస్టర్ ఉంది.

ఇక ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ నెత్తికి ఎర్ర కండువా, చేతికి ఎర్ర రుమాలు, నాటు తుపాకి ఉంది. ఉద్యమ వీరుడిలా కనిపిస్తున్నారు. బహుశా.. సినిమాలో మెగాస్టార్ నక్సలైట్ గా కనిపించే పాత్రకు సంబంధించిన లుక్ లా కనిపిస్తోంది. మొత్తానికి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ రెండు అదిరాయ్. సింగిల్ డైలాగ్ లేదు. యాక్షన్ లేదు. జస్ట్ పోస్టర్స్ తోనే ఆచార్య కేక పుట్టిస్తున్నాడు.

ఈ చిత్రంలో చిరుకి జంటగా కాజల్ నటిస్తున్నారు. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.