కొత్త ఫేస్ బుక్ వచ్చేస్తోంది

ఫేస్ బుక్ న్యూ వర్షన్ వచ్చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ఫేస్ బుక్ కొత్తగా కనిపించనుంది. పాత వర్షన్ ని అప్ డేట్ చేయనున్నారు. వాస్తవానికి కొన్నినెలల కిందటే న్యూ ఫేస్ బుక్ ఫీచర్ మెనూ లిస్టులో కనిపిస్తోంది. అయితే న్యూ ఫేస్ బుక్ ఇష్టంలేని వాళ్లు క్లాసిక్ లోనే కొనసాగే వెసులుబాటు ఇన్నాళ్లు అందించింది.

అయితే సెప్టెంబర్ 1 నుంచి పాత వర్షన్ ని పూర్తిగా తొలగించేసి.. కొత్త లుక్ ని మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. దీనికి సంబంధించిన డిజైన్ కూడా పూర్తయింది. అంతేకాదు, డార్క్ మోడ్ ఫీచర్ ను కూడా ఫేస్ బుక్ తన వినియోగదారులకు అందిస్తోంది. ఫేస్ బుక్ లోనే షార్ట్ వీడియో ఫీచర్ ని తీసుకురానున్నారు.