అన్నయ్య బర్త్ డే.. తమ్ముడు ఎమోషనల్ పోస్ట్ !

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. అన్నయ్య బర్త్ డే సందర్భంగా తమ్ముడు పవన్ కల్యాణ్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనకు అన్నయ్య తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చేయిపట్టి పెరిగానని, ఆయనే తన తొలిగురువు అని పవన్‌ పేర్కొన్నారు.

అంచెలంచెలుగా ఎదిగి కొట్లాది మంది అభిమనులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి చిరంజీవి. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవా తత్పరతను ఆవిష్కరింపజేసింది. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయన సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారని పవన్‌ పేర్కొన్నారు. ఎందరితో స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి జన్మదినం సందర్భంగా తెలుగువారందరూ ఆయనను ఆశీర్వదించాలని పవన్‌ కోరారు.