కాంగ్రెస్’లో మధ్యంతరం
కాంగ్రెస్ పార్టీకి శాశ్వతం పోయింది. తాత్కాఌకం పోయింది. ఇప్పుడు మధ్యంతరం వచ్చేసింది. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కరువైన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో యేడాది పాటు తాత్కాఌక అధ్యక్ష బాధ్యతలని సోనియాగాంధీ స్వకరించారు.
ఇక సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సింది. అయితే సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరక అధ్యక్షుడి ఎన్నిక వాయిదాపడింది. దీంతో మధ్యంతర అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఎన్నుకున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ సోనియానే స్పష్టం చేసినా, ఈ పరిస్థితుల్లో మరో మార్గం లేక పార్టీ సీనియర్లు ఆమెపైనే భారం వేశారు.