సుశాంత్’కు డ్రగ్ ఇచ్చి హత్య చేశారట !
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదు. హత్యే అంటున్నారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. సుశాంత్ ని ఎలా మర్డర్ చేశారో కూడా ఆయన అంచనా వేసి చెప్పారు. ‘సుశాంత్ మర్డర్’ పేర్కొన్న సుబ్రహ్మణ్యం స్వామి.. గతంలోని కొన్ని కేసులని పోల్చి చూసి మరీ చెప్పారు.
“నాడు సునంద పుష్కర్ పోస్టుమార్టం సందర్భంగా ఎయిమ్స్ డాక్టర్లు ఆమె కడుపులో ఏమి గుర్తించారో అదే అసలైన ఆధారంగా నిలిచింది. కానీ శ్రీదేవి, సుశాంత్ విషయంలో అలా జరగలేదు. ఇక సుశాంత్ విషయానికొస్తే.. దుబాయ్ కు చెందిన అయాష్ ఖాన్ అనే డ్రగ్ డీలర్ సుశాంత్ హత్య జరిగిన రోజున అతడిని కలిశాడు. ఎందుకు?” అంటూ ప్రశ్నించారు.