ఏపీలో 9,927 కొత్త కేసులు, 92 మరణాలు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 9,927 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 92 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,71,639కి పెరిగింది. కరోనా మృతుల సంఖ్య 3,460కి చేరింది.

ఇక ఇప్పటి వరకు 2,78,247 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  ప్రస్తుతం 89,932 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా నమోదైన 92 కొవిడ్‌ మరణాల్లో చిత్తూరులో అత్యధికంగా 16మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, అనంతపురంలో 11, కడపలో 10, ప్రకాశం 10, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి 8, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో చెరో ఆరుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, విజయనగరంలో ఒకరు చొప్పున మృత్యువాతపడ్డారు