బాలు ఆరోగ్యం లెటెస్ట్ అప్ డేట్.. ఏంటంటే ?

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ రోజువారిగా వీడియో మేసేజ్ లు అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చరణ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులతో పంచుకున్నారు. వీడియో మెసేజ్ ని షేర్ చేశారు.

“ఈరోజు వైద్యులతో మాట్లాడాను. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీర్వాదానికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యుల బృందం కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న కోలుకోవడంలో వాళ్లు నిరంతరం కష్టపడ్డారు. త్వరలోనే నాన్న మామూలు స్థితికి వస్తారని విశ్వసిస్తున్నా. నా అప్‌డేట్‌లు అనుసరిస్తున్న వారికి నిజంగా ఇది సుదినం.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా.. నాన్న ఆరోగ్యం గురించి తమిళంలో అప్‌డేట్‌ పెట్టమని అడుగుతున్నారు. అలా చేయలేకపోవడానికి కారణం దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఆయన వేలాది పాటలు పాడారు. అన్ని భాషల్లో అప్‌డేట్‌ పెట్టడం నాకు కొంచెం కష్టమైన పని. నాన్న కోసం ప్రార్థించటానికి, వైద్యులతో మాట్లాడానికి, అప్‌డేట్స్‌ ఇవ్వడానికి నాకు సమయం సరిపోవడం లేదు. నేను చెప్పేది అర్థం కాని వాళ్లు, ఇంగ్లిష్‌ తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకుంటారని ఆశిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు” అని చరణ్ చెప్పారు.

 

View this post on Instagram

 

#SPB health update

A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on