‘ఆచార్య’ కాపీ కథ.. క్లారిటీ ఇచ్చేశారు !

‘ఆచార్య’ చిత్ర కథ తమదేనంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ, రాజేశ్ మండూరి అనే ఇద్దరు రచయితలు వేర్వేరుగా ఆరోపణలు చేశారు. తాజాగా దీనిపై ‘ఆచార్య’ చిత్రబృందం స్పందించింది. ‘ఆచార్య’ సినిమాను కొరటాల శివ తయారుచేసిన ఒరిజినల్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ‘ఆచార్య’ సినిమా కథ కాపీ కొట్టారంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
 
కాపీ ప్రచారంపై మరికొంత వివరణ కూడా ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే (ఆగస్టు 22) కానుకగా ఆచార్య ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లని విడుదల చేశాం. వాటి ఆధారంగా చేసుకొని సినిమా కథ కాపీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి ఆచార్య కథ చాలా గోప్యంగా ఉంచాం. అసలు కథ ఏంటన్నది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలాంటప్పుడు ఫస్ట్ లుక్ తోనే ఆచార్య కథ కాపీ అనిప్రచారం చేయడం దర్శకుడు కొరటాల ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమేనని వివరణ ఇచ్చారు.