అల.. బుల్లితెర రికార్డ్ !

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాన్ బాహుబలి రికార్డులన్నీ క్రాస్ చేసింది. ఇల అల.. పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టన్నుల కొద్ది రికార్డులు కొట్టాయ్. ఇంకా కొడుతూనే ఉన్నాయి.

తాజా అల.. ఖాతాలో బుల్లితెర రికార్డ్ పడింది. గత వారం ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన అల.. రికార్డ్ స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తెలుగు చిత్రాలలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం అంటున్నారు. లాక్‌డౌన్ వలన ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఈ సినిమాని చాలా మంది వీక్షించినట్టు తెలుస్తోంది.

ఫర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వస్తే.. జనాలు ఎలా స్వీకరిస్తారు ? అన్నది అల.. తో అర్థమవుతోంది. ఆపా-పాట-మాట అన్నీ అద్భుతంగా కుదిరాయి. దానికి బన్నీ స్టయిలీష్ యాక్టింగ్ తోడైంది. దీంతో క్లాస్-మాస్-ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరూ ఆస్వాదిస్తున్నారు.