అల.. సౌత్ ఇండియా రికార్డ్ !

2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘అల.. వైకుంఠపురంలో’ సౌత్ ఇండియా రికార్డ్ సృష్టించింది. వరల్డ్ పీమియర్ టెలివిజన్ షోస్ లో  2.19 కోట్ల ఇంప్రెషన్స్ సొంతం చేసుకొని  సౌత్ ఇండియా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసినీ బ్యానర్ ప్రత్యేక పోస్టర్ ని అధికారిక ట్విట్టర్ ఖాతాలోషేర్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులకి కృతజ్జతలు తెలిపింది.

అల్లుఅర్జున్-బన్నీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించింది. ఎవరికైనా స్థానాన్ని కల్పించవచ్చు. కానీ స్థానాన్ని కల్పించలేం. అది మనకు మనమే కల్పించుకోవాలి. సాధించుకోవాలి అనే లైన్ తో అల.. వైకుంఠపురంలో తెరకెక్కింది. సినిమాని త్రివిక్రమ్ తనదైన శైలిలో ఎంటర్ టైనింగ్ నడిపాడు. ఆయన మాటల పదను. బన్నీ స్టయిలీష్ యాక్షన్, పూజా గ్లామర్, అన్నింటికంటే థమన్ సంగీతం సినిమాని ఉన్నతస్థానంలో నిలిపాయ్.