139 మంది రేప్ కేసులో యాంకర్ ప్రదీప్’ని ఇరికించారా ?
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సంచలన కేసు నమోదైన సంగతి తెలిసిందే. మిర్యాలగూడకు చెందిన యువతి తనని ఏకంగా 139 మంది రేప్ చేశారని ఫిర్యాదు చేశారు. వారి వివరాలని, ఆధారాలని పోలీసులకి అందజేసింది. వాటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
139 మందికి నోటీసులు నోటీసులు అందజేసేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై ప్రదీప్ స్పందించారు. 139 మంది రేప్ కేసులో నేను లేను. తనకు ఎలాంటి సంబంధం లేదు. నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. ఈ మేరకు ఓ వీడియో మేసేజ్ విడుదల చేశారు.