నీట్‌, జేఈఈ పరీక్షలపై తెలుగు రాష్ట్రాల స్టాండ్ ఏంటీ ?

దేశవ్యాప్తంగా నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్లు తీవ్రతరమవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో ఆందోళనలు నిర్వహించడానికి సమాయత్తమవుతోంది. శుక్రవారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

కేంద్రం మాత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తుండగా, మరికొన్ని ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. గోవా, బిహార్ ప్రభుత్వాలు మాత్రం ప్రవేశ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్నాయి.
ఢిల్లీ ప్రభుత్వం పరీక్షల రద్దు చేయాలని కేద్రాన్ని కోరుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వైరస్‌ సోకిన దాఖలాలు కోకొల్లలంటూ గుర్తుచేసింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ నీట్, జేఈఈ వంటి పరీక్షలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు. మరీ..  నీట్‌, జేఈఈ పరీక్షలపై తెలుగు రాష్ట్రాల స్టాండ్ ఏంటీ ? అన్నది తెలియాల్సి ఉంది.