ఆ రొమాంటిక్ టైటిల్ త్రివిక్రమ్’దేనా ?


సత్యదేవ్-తమన్నా జంటగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కన్నడ హిట్ ‘లవ్ మాక్ టైట్’కి రిమేక్  ఇది. ఈ చిత్రానికి తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ రొమాంటిక్ టైటిల్ త్రివిక్రమ్ ది అట. ఈ టైటిల్ కోసం స‌త్య‌దేవ్ త్రివిక్ర‌మ్ ని సంప్ర‌దించాడ‌ని, టైటిల్ ని ఇవ్వ‌డానికి త్రివిక్రమ్ ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది.

‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ సినిమాలో ‘శీతాకాలం సూర్యుడిలా కొంచెం కొంచెం చూస్తావే..` అనే పాట ఉంది. ఈ లైన్ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించాడ‌ట త్రివిక్ర‌మ్‌. ఇప్పుడీ రొమాంటిక్ టైటిల్ ని సత్యదేవ్ సినిమా కోసం దానం చేశాడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది సినిమాలో సత్యదేవ్ ఓ చిన్ని పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.