వరుణ్ తేజ్ కోసం ఇద్దరు దర్శకులు
‘గరుడవేగ’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ కాలేదు. ఇటీవలే నాగార్జునతో ఓ సినిమా ఖాయమైంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే మరో సినిమాని లైన్ లో పెట్టే ప్రయత్నాల్లో ప్రవీణ్ సత్తారు ఉన్నట్టు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఓ సినిమా చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది.
14రీల్స్ బ్యానర్ లో వరుణ్ తేజ్ మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తారు. ఇదో పోలీస్ స్టోరీ అని చెబుతున్నారు. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు కూడా 14రీల్స్ లో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నారు. ఆయన కూడా వరుణ్ తేజ్ తోనే. అంటే.. వరుణ్ తేజ్ సినిమాకు ప్రవీణ్ లేదా సాగర్ చంద్రలో ఎవరో ఒకరు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఎఫ్ 3 చేయాలి. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత 14రీల్స్ లో సినిమా చేయనున్నారు.