సురేష్ బాబు చేతులెత్తేశారు

టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు చేతులెత్తేశారు. ఇప్పట్లో షూటింగ్ లు మొదలుపెట్టే ధైర్యం తనకి లేదని తేల్చి చెప్పేశారు. తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లకి అనుమతులు లభించి చాన్నాళ్లవుతోంది. అయినా.. పెద్ద సినిమాలేవీ సెట్స్ మీదకు వెళ్లడం లేదు.

తాజాగా దీని గురించి నిర్మాత సురేష్ బాబు స్పందించారు. షూటింగ్ లకు అనుమతి ఇచ్చినప్పటికీ తనకు ధైర్యం లేదనీ, మరో రెండు మూడు నెలలపాటు షూటింగ్ లు ప్రారంభించేది లేదన్నారు. షూటింగ్ లో ఉన్న వారందరికీ భద్రత కల్పించి కాపాడగలనన్న విశ్వాసం తనకు లేదు. అందుకే షూటింగ్ కు తొందరపడటం లేదని తెలిపారు.

సురేష్ బాబు తమ్ముడు, విక్టరీ వెంకటేష్ ది ఇదే మాట. ఈ యేడాది షూటింగ్ లు చేయబోనని ఇప్పటికే వెంకీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన నారప్ప సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత ఎఫ్ 3 సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.