ఈసారి భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కరోనా కష్టాలు దేవుళ్లకి కూడా తప్పడం లేదు. కరోనా లాక్‌డౌన్ తో దేశ వ్యాప్తంగా రెండునెలలకుపైగా దేవాలయాలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. మూడో దఫా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దేవాలయాలు తెరచుకున్నాయి. అయితే మునుపటిలా భక్తులని అనుమతించడం లేడు. తిరుమల శ్రీవారి దర్శనం షరతుల మధ్య జరుగుతోంది. అయితే సెప్టెంబరు 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టిటిడి తెలిపింది.

కరోనా కారణంగా స్వామివారి వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించే పరిస్థితి లేదన్నారు టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్ది. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని వివరించారు. అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే యథాతథంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.