బాక్సర్’గా ఈషా !

తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఇన్నాళ్లు అందాలతో ఆకట్టుకొంది. సినిమాలు ఉన్నా.. లేకున్నా వరుస ఫోటో షూట్స్ తో సందడి చేసింది. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత ఈషా రెబ్బా పంచ్ ఇవ్వనుంది. అవునూ.. ఆమె బాక్సర్ గా మారనుంది. ఆమె తదపరి సినిమాలో భాక్సర్ గా కనిపించనుంది.

ఇందుకోసం కరోనా లాక్‌డౌన్ టైమ్ లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసింది. దీంతో పాటు జిమ్నాస్టిక్ట్స్ నేర్చుకొంది. ఫిట్నెస్ పై పోకస్ పెట్టింది. అయితే ఈషా రెబ్బా బాక్సర్ గా కనిపించబోయేది ఓటీటీ మూవీనా ? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తానని ఈషా ఓపెన్ ఆఫర్ ఇస్తోంది.