వెలుగులోనికి వస్తున్న నూతన్ నాయుడు భార్య దారుణాలు

బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో ఓ దళీత యువకుడికి శిరోముండన చేసిన ఘటన సంచలనంగా మారింది. నూతన్ నాయుడు సతీమణి మధుప్రియ దగ్గరుండి మరీ.. ఈ దారుణాన్ని చేయించింది. ఈ ఘటనకి సంబంధించిన సీసీ పుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు. ఇందులో నూతన్ నాయుడు భార్య ఎంత కర్కశంగా ప్రవర్థించింది అన్నది క్లియర్ గా కనిపిస్తోంది. 

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో నూతన్ నాయుడు భార్యకు సంబంధించి మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నట్టు సమాచారమ్. ఆమె అహంభావి. గతంలో చీటీలు నిర్వహించేది. పలువురికి చీటీ డబ్బులు ఎగొటిందనే ఆరోపణలు వస్తున్నాయి. వీరి వ్యవహారం తెలిసి చుట్టు పక్కల వారు కూడా వీరి వైపు వెళ్లరు. దూరంగా ఉంటారని చెబుతున్నారు. కేవలం నూతన్ నాయుడు బిగ్ బాస్ తో ఫేమస్ అవ్వడం వలనే వారికి పేరొచ్చందని చెబుతున్నారు.