రియా విజ్ఝప్తికి సీబీఐ ఓకే
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రియా వలనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకి రియా డ్రగ్స్ అలవాటు చేసింది. మానసికంగా వేధించింది. ఆర్థికంగా వాడుకుందనే ఆరోపనలున్నాయి. ప్రస్తుతం రియా సీబీఐ విచారణకు హారవుతోంది. శుక్రవారం సుదీర్ఘంగా సీబీఐ రియాని విచారించింది. ఈరోజు విచారిస్తోంది.
అయితే రియా తనకి రక్షణ కల్పించాలంటూ సీబీఐకి లేఖ రాసింది. అందుకు సీబీఐ ఓకే చెప్పింది. డీఆర్డీఓ అతిథి గృహం నుంచి తన ఇంటికి వెళ్లే క్రమంలో రియా చక్రవర్తికి భద్రత కల్పిస్తామని ముంబై పోలీసులు తెలిపారు. శనివారం కూడా రియా ఆమె సోదరుడు షోవిక్లు సీబీఐ దర్యాప్తు కోసం డీఆర్డీఓ కార్యాలయానికి బయలు దేరే ముందే వారికి రక్షణ కల్పించేందుకు ముంబై పోలీసులు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు.