‘అన్ లాక్ 4’ గైడ్ లైన్స్ ని విడుదల చేసిన కేంద్రం
ఆగస్టు 31తో అన్ లాక్ 3 ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అన్ లాక్ 4 గైడ్ లైన్స్ ని కేంద్రం విడుదల చేసింది. మెట్రో రైళ్లకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకి అనుమతులు ఇచ్చింది.
మరోవైపు కంటైన్మెంట్ జోన్లలోమాత్రం సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు హోం శాఖ అవకాశం కల్పించింది.