తెలంగాణ కరోనా రిపోర్ట్ : 2,924 కేసులు, 10 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3వేల చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయ్. 2,924 కేసులు వచ్చాయ్. మరో 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,23,090కి చేరింది. మృతుల సంఖ్య 818 కి చేరింది.

ఇక కేంద్రం అన్ లాక్ 4 గైడ్ లైన్స్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే హైదరాబాద్ మెట్రో పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కంటోన్మెంట్స్ లో తప్ప మిగితా ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉండకూడదని కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు, థియేటర్స్ మరో నెలపాటు బంద్ కానున్నాయని తెలిపింది.