పవన్ బర్త్ డే.. రెడీ ఫర్ ట్రిపుల్ ట్రీట్ !

సెప్టెంబర్ 2 – ఈ డేటు గురించి ఓ మూడ్నేళ్ల ముందు నుంచే హంగామా మొదలైపోయింది. ఈ డేటుకి అంత పవర్ ఏంటీ అంటే.. ? ఆ రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే. రెండ్నెళ్ల ముందు నుంచి పవన్ అభిమానులు సెలబ్రేషన్స్ మొదలెట్టేశారు. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 2న పీక్స్ కి వెళ్లనున్నాయ్. ఎంతలా అంటే.. ? వరల్డ్ రికార్డ్ ఖాయం అన్నమాట. దాని గురించి చెప్పడం కాదు.. చూడాలంతే!

ఇక పవన్ బర్త్ డే కానుకగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు గిఫ్టులు రాబోతున్నాయని సమాచారమ్. వకీల్ సాబ్ నుంచి టీజర్ రానుంది. ఇదీగాక క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా అప్ డేట్ ఇవ్వనున్నారు. అది ఫస్ట్ లుక్ నా ? టైటిల్ పోస్టర్ నా ? మోషన్ పోస్టర్ నా ? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

మూడో గిఫ్ట్.. ఈ రెండింటికి మించింది. పవన్ ఫ్యాన్స్ కి బాగా ఇష్టమైంది. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ రెండో సినిమా రాబోతుంది. పవన్ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి కూడా అప్ డేటు రాబోతున్నట్టు సమాచారమ్. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ అందబోతుంది.