సంచలన కేసు.. సిల్లీగా మారింది !

హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ సంచలన కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనని 139 మంది రేప్ చేశారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ లిస్టులో సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ లిస్టులో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు.

ఇప్పుడీ సంచలన కేసు కాస్త సిల్లీగా మారింది. తనని 139 మంది రేప్ చేయలేదని బాధిత యువతి వెల్లడించింది.హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆమె మాట్లాడారు. ప్రదీప్, నటుడు కృష్టుడుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను తప్పుడు కేసులు పెట్టిన వారికి క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.

ఉద్యోగం పేరుతో డాలర్ బాయ్ అలియాస్‌ శ్రీకర్‌రెడ్డి తనను మోసం చేశాడని, చిత్రహింసలకు గురిచేశాడని ఆమె వివరించారు. అతని సూచన మేరకే కేసు పెట్టినట్టు చెప్పారు. శ్రీకర్‌రెడ్డి తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని, తాను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని బెదిరించాడని ఆమె వివరించారు. అలాంటి పరిస్థితుల్లోనే కేసు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో.. 139 రేప్ కేసు ఫేక్ అని తేలిపోయినట్టయింది.