బిగ్ బాస్ 4 టైమింగ్స్ అప్ డేటు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. గతంలోఎన్నడూ చూడని ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామని హోస్ట్ నాగ్ ముందు నుంచి చెబుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 టైమింగ్ అప్ డేటు ఇచ్చారు. గత సీజన్స్ మాదిరిగానే సోమ-శుక్రవారాలు బిగ్ బాస్ షో రాత్రి 9:30నిమిషాలకి ప్రారంభం అవుతోంది. శని-ఆదివారాల్లో మాత్రం ఓ అరగంట ముందుగా అనగా రాత్రి 9గంటల నుంచే ప్రారంభం అవుతోంది.

బిగ్ బాస్ 4 కోసం అంతా సిద్ధం. అయితే ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో పాల్గొనబోయే సభ్యుల వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఓ లిస్ట్ సోషల్ మీడియాలో ప్రచార జరుగుతోంది. ఆ జాబితా ప్రకారం.. ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో రఘు మాస్టర్‌, ఆయన భార్య ప్రణవి, మహాతల్లి, ఆమె భర్త సుశాంత్‌, హెచ్‌ఎంటీవీలో వ్యాఖ్యాత సుజాత, టిక్‌టాక్‌ స్టార్‌ అరియానా గ్లోరీ, మెహబూబ్‌ దిల్‌సే, సోహైల్‌ రియాన్‌, కరాటే కల్యాణి, లాస్య, నోయల్‌, యాంకర్‌ ప్రశాంతి, జబర్దస్త్‌ అవినాష్‌లు ఉండనున్నారు.