వైరల్ : ఈషా రెబ్బా కొత్త ఫోటోలు


తెలుగమ్మాయి ఈషా రెబ్బా కొద్దిరోజులు కనబడకపోతే ఎదోలా ఉంటుంది. అదేనండీ.. ఆమె ఫోటోలు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్ ఫోటోలని ఈషా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈషా నుంచి కొత్త ఫోటోలు వచ్చాయి. ఈ సారి నిండుదనంతో కనిపిస్తొంది. క్యూలుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈశా రెబ్బా. అందం, నటనతో ఆకట్టుకుంటున్నా, బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను అందుకున్న చిత్రాలు ఒకట్రెండు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో బాక్సర్‌గా అభిమానులను ఆకట్టుకోనుంది. దీని కోసం ఈ చిన్నది ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది.

‘నేను నా తరువాత చిత్రంలో బాక్సర్‌గా కనిపించనున్నా. మానసికంగా, శారీరకంగా ఈ పాత్రలో లీనమవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నా. ఇదే కాదు జిమ్నాస్టిక్స్‌లోనూ తర్ఫీదు పొందుతున్నా. నిజమైన బాక్సర్‌లా తెరపై చెలరేగడమే నా ముందున్న లక్ష్యం.’ అంటూ ఈషా తెలిపింది.