గౌతమ్’పై సితార క్రైమ్ కామెంట్స్

సితార పాప అల్లరి పిల్ల అని మరోసారి రుజువు చేసుకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సితార ఇప్పటికే సోషల్ మీడియా స్టార్. ఆమె డ్యాన్స్ వీడియోలు, మహేష్ తో కలిసి చేసిన హంగామాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయ్. తాజాగా తన అన్నయ్య గౌతమ్ పుట్టినరోజున సితారదే డ్యామినేషన్ కనిపించింది.

అన్నయ్యను విష్ చేస్తూ సితార పాప.. ‘క్రైమ్‌లో నాతో ఉండేవాడు. కాని మొదట దొరికిపోయేది తనే. నాకు అన్నగా ఉన్నందుకు గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్ డే అన్నయ్య’ఓ వీడియో విడుదల చేసింది.

ఇక తనయుడు బర్త్ డే రోజున మహేష్ స్పెషల్ ట్విట్ చేశారు. “14వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన గౌతమ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడిగా నువ్వు పెరిగి పెద్దగా అవుతున్నందుకు గర్వంగా ఉంది. డొరేమాన్ టు అపెక్స్ లెజెండ్ వరకు నీతో కలిసి నేను జర్నీ చేయడం హ్యాపీగా ఉంది. నీకిది గొప్ప పుట్టినరోజు కావాలి..హ్యాపీ బర్త్ డే” అంటూ రాసుకొచ్చారు.