రూపాయి ఫైన్ కట్టేసిన ప్రశాంత్ భూషన్

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు భారత అత్యున్నత న్యాయస్థానం ఒక్క రూపాయి జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని సెప్టెంబర్‌ 15లోగా చెల్లించకపోతే 3నెలల జైలుశిక్ష, 3సంవత్సరాలు ప్రాక్టీస్‌పై నిషేధం విధిస్తామని కోర్టు తీర్పు వెలువరించింది.

అయితే కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఆయన న్యాయవాది, సీనియర్‌ సహచరుడు రాజీవ్‌ ధావన్‌ జరిమానా మొత్తం రూపాయిని తనకు విరాళంగా ఇచ్చినట్లు ప్రశాంత్‌ భూషణ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. ఆయన లాయర్ రూపాయి విరాళంగా ఇస్తున్న ఫోటోలని కూడా షేర్ చేశారు.