తెలంగాణలో  కరోనా రిపోర్ట్ : 1,873 కేసులు, 9 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,873 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. మరణాల సంఖ్య 827కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 24,216 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 1,849 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు నయమైన వారి సంఖ్య 92,837కి చేరింది.