వకీల్ సాబ్ టీజర్ రాట్లేదా ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకి ట్రిపుల్ ట్రీట్ అందబోతుంది. పవన్ బర్త్ డే కానుకగా రేపు (సెప్టెంబర్ 2) మూడు బహుమతులు రాబోతున్నాయి. వకీల్ సాబ్ టీజర్ తో పాటు క్రిష్, హారీష్ శంకర్ సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ రాబోతున్నాయి. 

వకీల్ సాబ్ కు సంబంధించిన అప్ డేటు రేపు  ఉదయం 9:09కి రాబోతున్నట్టు సంగీత దర్శకుడు తెలిపారు. అయితే ఆయన ట్విట్ ని బట్టీ చూస్తే.. వచ్చేది వకీల్ సాబ్ టీజర్ కాదు. మ్యూజికల్ గిఫ్ట్ గా అనిపిస్తోంది. బయట ప్రచారం జరగడమే కానీ.. ఎక్కడ వకీల్ సాబ్ టీజర్ అని చిత్రబృందం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో పవన్ బర్త్ డే గిఫ్ట్ గా వకీల్ సాబ్ మ్యూజికల్ గిఫ్ట్ నే ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది.