ప్రణబ్ అంతిమ యాత్ర ప్రారంభం

మాజీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర ప్రారంభం అయింది. లోధిరోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. గన్‌ క్యారేజ్‌పై కాకుండా ప్రత్యేక అంబులెన్స్‌లో శ్మశానవాటికకు ప్రణబ్ పార్థవదేహాన్ని తరలిస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఆగస్టు 10న ప్రణబ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మెదడులో కణితిని తొలగించేందుకు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ఈ సమయంలో ప్రణబ్ కు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకటంతో ప్రణబ్‌ ఆరోగ్య స్థితి క్షీణించింది. దాదాపు 21 రోజుల పాటు పోరాడిన ప్రణబ్ నిన్న (ఆగస్ట్ 31) సాయంత్రం కన్నుమూశారు.