ప్రణబ్ గురించి ప్రపంచ దేశాలు ఏమన్నాయంటే ?

మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ భారత ముద్దుబిడ్డ మాత్రమే కాదు. ప్రపంచ దేశాలు కూడా మెచ్చిన బిడ్డ. అందుకే ఆయన మృతిపట్ల ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ప్రణబ్ దాకు నివాళులు అర్పించాయి. అమెరికా, రష్యా, నేపాల్, శ్రీలంక.. తదితర దేశాలు ప్రణబ్ మృతిపట్ల సంతాపం ప్రకటించాయి.

‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం పట్ల మేం సంతాపం తెలయజేస్తున్నాం. ఓ గొప్ప నేతను కోల్పోయిన భారత ప్రజలకు ఈ సమయంలో మేము సంఘీభావంగా నిలుస్తున్నాం. ఆయన భారత చరిత్ర పుటల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు’ అంటూ అమెరికా విదేశాంగ శాఖ తన సంతాప సందేశాన్ని తెలియజేసింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ సైతం ముఖర్జీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.