బన్నీ.. ఇదేమీ బాగులేదూ.. !!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పవన్ స్పెషల్ గా బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకోరు. కానీ ఆయన అభిమానులు ఓ పండలా జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇక పవన్ బర్త్ డే కానుకగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్.

మెగా ఫ్యామిలీ పవన్ ని స్పెషల్ గా విష్ చేస్తున్నారు. అయితే స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం సింపుల్ గా పవన్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ట్విట్ చేశారు. కనీసం సింగిల్ పిక్ కూడా షేర్ చేయలేదు. అల్లు శిరీష్ కూడా అంతే. పవన్ తో ఓ రేర్ పిక్ ని షేర్ చేస్తే బాగుణ్ను అని పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ చిన్నప్పుడు పవన్ తనని ఆడిస్తున్న ఫోటోని షేర్ చేశారు. ఇందులో పవన్ టీనేజ్ బోయ్ గా కనిపిస్తున్నారు. 

మరోవైపు పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన ముగ్గురు అభిమానులకి మెగా హీరోలంతా  సంతాపం తెలిపారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది. అభిమానుల కుటుంబాలకి అండగా ఉంటామని తెలిపారు. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి ట్విట్ చేసారు.