అన్నయ్య ఆశీర్వాదం అందిందోచ్ !
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. కానీ ఏదో ఓ లోటు. అదేటంటే… ? అన్నయ్య ఆశీర్వాదం ఇంకా అందలేదేంటీ.. ?? ఇప్పుడు అది అందింది. ముందుగా చిత్తూరులో కరెంట్ షాక్ తో మృతి చెందిన అభిమానులకు చిరు సంతాపం తెలిపారు. ఆ తర్వాత తమ్ముడు పవన్ కి శుభాకాంక్షలు చెబుతూ ట్విట్ చేశారు.
“తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కల్యాణ్ బాబు” అంటూ మెగాస్టార్ ట్విట్ చేశారు.ఈ సందర్భంగా చక్కటి ఫోటో ఒకటి చిరు షేర్ చేశారు. పవన్-చిరు ప్రేమతో ఆలింగనం చేసుకున్న ఫోటో అది.
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బాబు Happy Birthday @PawanKalyan pic.twitter.com/cOE5G1ljK5— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2020