పవన్ ఫ్యాన్స్’ని సప్రైజ్ చేసిన మహేష్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 49వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ అభిమానులని సప్రైజ్ చేశారు.

పవన్ తో కలిసి దిగిన రేర్ ఫోటో ఒకటి షేర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. పవన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ సమయంలోని పిక్ లా ఉంది అది. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పవన్, మహేష్ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. మరీ.. అది ఎప్పుడు కుదురుతుంది ? అన్నది చూడాలి.