మృతుల కుటుంబాలకు చరణ్, బన్నీ ఆర్థిక సాయం

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఫెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు పవన్ అభిమానులు మృతి చెందారు. అభిమానుల మృతిపట్ల పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవితో పాటు మిగిలిన హీరోలు దిగ్బ్రాంతిని, సంతాపాన్ని తెలియజేశారు.

జనసేన పార్టీ తరుపున మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. వకీల్ సాబ్ చిత్రబృందం, కూడా ఒక్కో మృతుల కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. పీఎస్‌పీకే 27 మూవీ సంస్థ కూడా మరణించిన వారి కుటుంబాలకి రూ.2లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని పేర్కొంది. తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ లు కూడా మృతుల కుటుంబాలకి ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుల కుటుంబానికి రూ. 2.5లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు చరణ్. ఇక బన్నీ ఒక్కో కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. చాలా ఘనంగా జరగాల్సిన పవన్ పుట్టినరోజు వేడుకులు అభిమానుల మృతితో కళ తప్పాయి.