సుశాంత్ కేసు.. ఇద్దరు అరెస్ట్ !

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ విచారణ జరుగుతోంది. శని, ఆది, సోమవారాల్లో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిలను సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. వందల ప్రశ్నలకి రియా నుంచి సమాధానాలు రాబట్టరు. మంగళవారం సుశాంత్ కుటుంబ సభ్యులని విచారించింది. ఇప్పుడీ కేసులో అరెస్ట్ లకు తెరలేపింది సీబీఐ.

ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్ట్ చేసింది. ముంబైలోని బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోయిక్ చక్రవర్తి ( రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.మిరాండా… రాజ్‌పుత్ మాజీ హౌస్ కీపింగ్ మేనేజర్. ఈయనే సుశాంత్ డబ్బులని రియాకి అందించేవాడని తెలుస్తోంది. మరోవైపు సుశాంత్  ది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఓ సీబీఐ అధికారి చెప్పినట్టు తెలుస్తోంది.