ఏపీ తెదేపా అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ?

ఏపీ తెదేపాకు కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు ఏపీ తెదేపా అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో అచ్చెన్నాయుడిని నియమించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారమ్. వాస్తవానికి ఏపీ తెదేపా అధ్యక్ష పదవి కోసం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు బలంగా వినిపించింది.

ఆయనకి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ యువతకు పెద్దపీఠ వేస్తుందనే సంకేతాలు ఇవ్వాలనుకున్నారు. కానీ రామ్మోహన్ నాయుడు వయసు చాలా చిన్నది. ఆయనకి ఇంకా అనుభవం వచ్చాక.. పెద్ద బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తుందని తెలుస్తోంది. ప్రతిపక్షాన్ని బలంగా ఢీకొనే అచ్చెన్నాయుడుకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారు. అతి త్వరలోనే దీనిపై ప్రకటన రావొచ్చని చెబుతున్నారు.

ఇక ఇటీవల ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన అచ్చెన్నాయుడు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇక అసెంబ్లీలో వందమంది వచ్చినా.. మాటలతో గట్టిగా నిలబడే అచ్చెన్నాయుడుకి ఏపీ తెదేపా అధ్యక్షుడు అయితే.. ఆయన దూకుడు మరింత పెరగవచ్చని చెబుతున్నారు. ఇదీ బాగానె ఉంది. కానీ నారా లోకేష్ ని ఏం చేద్దామనుకుంటున్నారు ? అన్నదే అర్థం కావడం లేదని తెదేపా నేతలు గుసగుసలాడుకుంటున్నారు.