‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఫస్ట్ లుక్

నటుడుగా నందు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడు ఆయన సోలో హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ఈ చిత్రానికి రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయీభవ బ్యానర్ నిర్మిస్తోంది. నందు బర్త్ డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. 

ఇందులో నందు పోతురాజుగా కనిపించనున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ వీరాభిమానిగా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ లోనే చెప్పేశారు. ఫస్ట్ లుక్ లో  నందు మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో నందు సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారమే బిగ్ బాస్ 4 మొదలు కానుంది.