దిలీప్ కుమార్ ఇంట్లో మరో విషాదం


బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు ఇషాన్ ఖాన్ (90) కరోనాతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఇషాన్ ఖాన్ గుండె సంబంధిత వ్యాధితో  బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం విషమించింది. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం రాత్రి ఇషాన్ ఖాన్ మృతి చెందారు.

ఇటీవలే దిలీప్ కుమార్ ఇద్దరు సోదరులు అస్లాంఖాన్‌, ఇషాన్ ఖాన్‌లు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆగస్టు 21న పరిస్థితి విషమించి అస్లాం ఖాన్ చనిపోయారు. ఇప్పుడు ఆయన రెండో సోదరుడు ఇషాన్ ఖాన్‌ మరణించడంతో దిలీప్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇషాన్ ఖాన్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.