ఫేస్ బుక్ సంచలన నిర్ణయం.. రాజాసింగ్ పై నిషేదం !
ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకొంది. తెలంగాణ భాజాపా ఎమ్మెల్యే రాజా సింగ్ పై నిషేధం విధించింది. హింసను ప్రేరేపించకూడదు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదన్న తమ పాలిసీని రాజాసింగ్ ఉల్లంఘించారరని.. ఈ క్రమంలోనే ఆయనపై నిషేధం విధించినట్లు ఫేస్బుక్ అధికార ప్రతినిధి తెలిపారు.
ఫేస్ బుక్ భాజాపాకు అనుకూలంగా మారిందనే విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల కాలంలో కాంగ్రెస్ అధిష్టానం రెండు సార్లు ఫేస్ బుక్, వాట్సాప్ కు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ యాజమాన్యం అలర్ట్ అయింది. తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేతల ఖాతాలని బ్లాక్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతాని బ్యాన్ చేసినట్టు తెలిసింది.
ఫేస్ బుక్ వేదికగా ఎమ్మెల్యె రాజా సింగ్ పలు వివాదాస్పద ట్విట్లు, వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. వాటిపై పలు ఫిర్యాదులు కూడా అందాయి. మరీ.. ఫేస్ బుక్ యాక్షన్ పై రాజాసింగ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది ? అన్నది ఆసక్తిగా మారింది.