7 నుంచి హైదరాబాద్ మెట్రో.. గైడ్ లైన్స్ విడుదల !

ఈ నెల 7 నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్లు నడవనున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి విడుదల చేశారు. . మెట్రో ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేస్తామన్నారు. స్మార్ట్‌ కార్డు, క్యాష్‌ లెస్ విధానంలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకే రైళ్లని నడపనున్నారు.

* ఫేజ్‌-1లో భాగంగా ఈ నెల 7న తొలుత కారిడార్‌-1 (మియాపూర్‌ – ఎల్‌బీ నగర్‌) పరిధిలో మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు; తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

* ఫేజ్‌-2 కింద 8న కారిడార్‌-3 (నాగోల్‌- రాయ్‌దుర్గ్‌)లో మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటల నంచి 12 గంటల వరకు; సాయంత్రం 4 నుంచి 9 వరకు రైళ్లు నడవనున్నాయి.

* ఫేజ్‌-3 కింద ఈ నెల 9 నుంచి అన్ని కారిడార్లలో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో సేవలు ఉండనున్నాయి.