ఆధ్యాత్మిక మూడులో కాజల్
స్టార్ హీరోయిన్ కాజల్ ట్విట్టర్ వేదికగా సద్గురుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూజ చేస్తున్న ఫోటోలని షేర్ చేశారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కరోనా ఎఫెక్ట్ తో కాజల్ ఇంటికే పరిమితమయ్యారు. ఆమె నటిస్తున్న ఆచార్య, భారతీయుడు 2 సినిమాలకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. మరోవైపు కాజల్ పెళ్లి ప్రయత్నాల్లోనూ ఉంది. చాన్నాళ్లుగా మంచి వ్యక్తి కోసం కాజల్ ఫ్యామిలీ వెతుకుతోంది. తనకి కాబోయేవాడు మంచి వాడైతే సరిపోతుంది. బాగా ఎత్తు ఉండాలి. సెన్సార్ హ్యూమర్ ఉండాలని ఓ ఇంటర్వ్యూలో కాజల్ చెప్పిన సంగతి తెలిసిందే.
Happiest birthday @SadhguruJV 🙏🏻❤️🙏🏻 pic.twitter.com/keFyPC6PCh
— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 3, 2020