మెగాస్టార్-మెహర్ రమేష్ సినిమాని ఖరారు చేసిన పవన్

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అది ‘లూసిఫర్’ రిమేక్ అని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్.. తర్వాత చేసేది మెహర్ రమేష్ సినిమానే అని చెప్పుకొంటున్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా మెగాస్టార్-మెహర్ రమేష్ సినిమాని పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి పవన్ పేరు పేరున కృతజ్ఝతలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెహర్ రమేష్ కు పవన్ ధ్యాంక్స్ చెప్పారు. అదే సమయంలో ‘చిరంజీవితో మీరు తీయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్’ అంటూ రాసుకొచ్చారు. దీంతో చిరుతో మెహర్ రమేష్ సినిమా ఖాయం అయినట్టయింది.

మరోవైపు మెహర్ రమేష్ తో సినిమా అంటే మెగా అభిమానులు  జంకుతున్నారు. ఆ ప్లాపు దర్శకుడితో సినిమా వద్దే వద్దు అంటున్నారు. మెహర్ రమేష్ కథ అద్భుతంగా చెబుతారు. కానీ దాన్ని నాసికంగా తీస్తారు అనే ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో ఆయనతో మెగాస్టార్ సినిమా అంటే అభిమానులు జంకుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వద్దని విజ్ఝప్తులు చేస్తున్నారు. మెగాస్టార్ మాత్రం మెహర్ రమేష్ కి మాట ఇచ్చేశారు. ఆయనతో సినిమా చేయడానికే ఫిక్సయినట్టు సమాచారమ్.