వి – సీక్వెల్ కూడానా !

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు కథానాయకులుగా నటించిన చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితి రావు  హైదరి కథానాయికలు. దిల్ రాజు నిర్మించారు. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో ‘వి’ విడుదల కానుంది.  దాదాపు 200 దేశాల్లో ఒకేసారి తెలుగు ప్రేక్షకులు ‘వి’ సినిమాని వీక్షించనున్నారు.

ఈ సినిమా తన కెరీర్ లో  మరో లెవల్ సినిమా అన్నారు దర్శకుడు ఇంద్రగంటి. మిస్టరీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ఆద్యంతం రక్తి కట్టిస్తుంది. ముఖ్యంగా స్టైల్ కంటెంట్ బడ్జెట్ పరంగా నంబర్ వన్ సినిమా ఇది. అందరినీ మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తే సీక్వెల్ తీస్తారా  అన్న సందేహం కలుగుతుంది. కానీ ఇప్పటివరకూ సీక్వెల్ గురించి ఆలోచించలేదు అని చెప్పుకొచ్చారు.