కింగ్ రంగంలోకి దిగిపోయాడు

కరోనా లాక్‌డౌన్ తో సినీ తారలంతా ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఆర్నెళ్ళుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్ప్పటికే షూటింగ్ లకు అనుమతులు లభించిన స్టార్ హీరోలు షూటింగ్ లకి వెళ్లేందుకు జంకుతున్నారు. ఇక ఈ యేడాది ఇంతే అంటున్నారు. కింగ్ నాగార్జున మాత్రం ధైర్యం చేశారు. షూటింగ్ లోకి దిగిపోయారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది.

దీనికి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసింది చిత్రబృందం. షూటింగ్ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. వైల్డ్ డాగ్ తో పాటుగా బిగ్ బాస్ తెలుసు సీజన్ 4 షూటింగ్ లోనూ నాగ్ పాల్గొననున్నారు. ఉదయం సినిమా షూటింగ్, సాయంత్రం బిగ్ బాస్ షూటింగ్ లతో ఫుల్ బిజీ కానున్నారు నాగ్. ఈ ఆదివారం (సెప్టెంబర్ 6) నుంచి బిగ్ బాస్ 4 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.