తెలంగాణ పోలీసుశాఖలో 272 పోస్టుల రద్దు

తెలంగాణ ప్రభుత్వం కొత్త పోస్టులని భర్తీ చేయాల్సింది పోయి.. ఉన్న పోస్టులని రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పోలీసు బెటాలియన్లలో 272 రెగ్యులర్‌ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పోస్టుల్లో పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల్ని నియమించుకోవాలని సూచిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రొనాల్డ్‌రాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రద్దు చేసిన పోస్టుల్లో బార్బర్‌, కుక్‌, ధోబీ, నర్సింగ్‌, మిడ్‌వైవ్‌, ఫార్మాసిస్టు, రేడియోగ్రాఫర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజియో థెరపిస్టు, స్కావెంజర్‌, స్వీపర్‌ విభాగాలున్నాయి. ఇంతకీ పోస్టులని ఎందుకు రద్దు చేసినట్టు ? అన్నదానిపై ఆర్థిక శాఖ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.